తన్నీరు హరీష్ రావుకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు: విజయానికి ప్రతీకగా, ధర్మానికి ప్రతిరూపంగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) గురువారం హైదరాబాద్లోని మాజీ మంత్రి వర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(MLA Tanneeru Harish Rao)ను మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్లోని హరీష్ రావు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే జిఎంఆర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నాయకులతో కలిసి ఆయనకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.