దుర్గమ్మ నామస్మరణల హోరు.. నిమజ్జనాల జోరు!
* ఏడుపాయలకు భక్తజన ప్రవాహం!
* జగన్మాతకు భక్తజన నీరాజనం
పాపన్నపేట,అక్టోబర్22: ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి(Yedupayala Vanadurga Mata Temple) గురువారం భక్తులు పోటెత్తారు. ప్రభుత్వ సెలవులు ముగియనున్న నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎటుచూసినా భక్తుల సందడి కనిపించింది.
మార్మోగిన దుర్గమ్మ నామస్మరణలు
జగజ్జనని వనదుర్గామాతను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల నామస్మరణలతో ఏడుపాయల పరిసరాలు మార్మోగాయి. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
నిమజ్జనాలతో సందడి
మరోవైపు నిమజ్జనాల సందడి కొనసాగడంతో ఏడుపాయల్లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. సెలవుల ముగింపు నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఏడుపాయలు జనసంద్రమైంది.