ప్రభుత్వ పాఠశాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు!

30-09-2026 | 08:23pm
  1. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ 
  2. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయినాథ్!!

శివంపేట సెప్టెంబర్ 30 (విజయక్రాంతి ): శివంపేట మండల కేంద్రంలోని పాంబండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హార్ట్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్(Heart Help Charitable Trust) సహకారంతో క్లియర్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ సాయినాథ్ సహకారంతో 500 లీటర్ల ఆర్వో వాటర్ ప్లాంట్ ప్యూరిఫికేషన్ ప్లాంటును 1,90,000 వేల రూపాయలతో ఏర్పాటు చేశారు.

దీనితోపాటు 140 మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక లీటర్ స్టీల్ వాటర్ బాటిల్స్ 20 వేల రూపాయలతో ఇప్పించారు. కంపెనీ ప్రతినిధులైన చైతన్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు మూడే రవి నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి ముందుకు వచ్చిన ట్రస్ట్ సభ్యులను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శివంపేట మండల విద్యాధికారి బుచ్చయ్య నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోహర్, ఉపాధ్యాయ బృందం,  గ్రామ సర్పంచ్ నాయిని సమతా వేణుగోపాల్ రెడ్డి,విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు  తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు