5 September, 2026 | 8:42 PM

బ్రిడ్జి గుంతకు బలైన నిండు ప్రాణం

05-09-2026 | 07:13pm

అత్తగారింటి నుంచి ఇంటికి తిరుగు ప్రయాణంలో విషాదం

రామాయంపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

గుంతల రోడ్డుకు మరో ప్రాణం బలి

రామాయంపేట సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): ఇంటికి తిరిగి వస్తున్న ఓ కుటుంబ పెద్దను రహదారిపై గుంత మృత్యువు రూపంలో కబళించింది. సిద్దిపేట జిల్లా ఇమామబాద్ గ్రామానికి చెందిన శివరాత్రి మహేష్(Shivaratri Mahesh) (40) రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌(Lakshmapur)లోని అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. రామాయంపేట శివారులోని మెదక్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఉన్న గుంతల కారణంగా అదుపుతప్పి ప్రమాదానికి గురై మృతి చెందినట్లు సమాచారం.

ప్రాణాలు తీస్తున్న గుంతలు.. పట్టించుకోని పాలక యంత్రాంగం అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతపై అధికారులు ఇకనైనా దృష్టి సారించి ప్రమాదకర గుంతలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు. మహేష్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆనందంగా అత్తగారింటికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరకుండానే విగతజీవిగా మారడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు