ఐకెపి సెంటర్ ప్రారంభం
31-10-2026 | 10:20pm
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak district) తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని(New Paddy Procurement Center) ఐకెపి అధికారుల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో పూజ చేసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఇందులో ఐకెపి అధికారి భాస్కర్ రెడ్డి, సెక్రెటరీ కల్పన, ఉప సర్పంచ్, పాలక వర్గం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.