విఠలేశ్వర ఆలయంలో పిడుగుపాటు

21-09-2026 | 09:28pm

తప్పిన పెను ప్రమాదం

పాపన్నపేట: మండలంలోని పొడిచన్‌పల్లి గ్రామంలోని విఠలేశ్వర స్వామి ఆలయం(vithaleswara swamy temple)లో సోమవారం సాయంత్రం పిడుగుపాటు కలకలం రేపింది. వినాయక ఉత్సవాల(Ganesha Festival) సందర్భంగా ఆలయంలో పూజలు, అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై రెండు, మూడుసార్లు భారీగా ఉరుములు వినిపించాయి. అనంతరం ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే గజస్తంభం సమీపంలోని ఆలయ భాగం పెచ్చులూడి కనిపించింది. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. పిడుగుపాటుగా గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో వందలాది మంది భక్తులు అక్కడ ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

మరిన్ని వార్తలు