కాంగ్రెస్ వి మాటలు ఘనం.. చేతల్లో శూన్యం

07-09-2026 | 11:08pm

జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య

జవహర్ నగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని చెప్పి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా అమలు చేయడం లేదంటూ నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ మను చౌదరి(Medchal Malkajgiri Collector Manu Choudary)కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి నీ పురస్కరించుకొని సోమవారం మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్(BRS) శ్రేణుల సమక్షంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేకల కావ్య మాట్లాడుతూ అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగం జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించాలని అన్నారు. పట్టణాలలో పారిశుధ్య నిర్వహణ మురుగు కంపుతో నిండిపోయి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని దావాఖానాల్లో మందులు కరువయ్యా యని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జిట్టా శ్రీనివాసరెడ్డి, దమ్మైగూడ చైర్మన్ ప్రణీత్, మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్, నాయకులు ప్రసాద్ గౌడ్, కూటికంటి వెంకటేష్ గౌడ్, అహ్మద్ పాషా పంతంగి సిద్ధులు యాదవ్, మూల సోమయ్య గౌడ్, సాయి, లక్ష్మణ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు