నేడు ఎన్టీఆర్ నగర్ లో బస్తీ దర్బార్
- సోషల్ జస్టిస్ పార్టీ వినూత్న కార్యక్రమం
ఎల్బీనగర్: హైదరాబాద్ నగరంలో బస్తివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్న ఉద్దేశంతో సోషల్ జస్టిస్ పార్టీ(Social Justice Party) వినూత్న కార్యక్రమం చేపట్టింది. బస్తీ దర్బార్(Basti Darbar) సర్కార్ వద్దకు సామాన్యుల గళం పేరిట మంగళవారం ఉదయం మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ లోని దుర్గా వద్ద బస్తీ దర్బార్ నిర్వహిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాలస్వామి తెలిపారు. బస్తీలు ఏర్పడి దశాబ్దాలు పూర్తికావస్తున్న బస్తీ ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పరిపాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బస్తీ ప్రజలను ఓటు బ్యాంకులుగా వాడుతున్నారు తప్పా, వారి సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు.
ఇంటి స్థలాలకు పట్టాలు, బస్తీ ప్రజలు ఎదుర్కొంటున్న కనీస వసతుల కల్పన, బస్తీ వాసుల సమస్యలు, పారిశుద్య సమస్యలు(Sanitation issues) వంటి మరెన్నో ఉన్నాయని వాటి గురించి తెలుసుకొని సంబంధిత అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి సోషల్ జస్టిస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నగర్ లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని అవన్నీ తెలుసుకుని పరిష్కరించేంత వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి కేవీ గౌడ్, హైదరాబాద్ హైడ్రా ఏరియా ఇన్ చార్జి వరంగల్ రమేశ్, అధికార ప్రతినిధి ప్రశాంత్ మహర్షి, సహాయ కార్యదర్శి సతీష్ మహాజన్, దివ్యాంగ్ విభాగ అధ్యక్షులు ఎమ్మెస్ యాదవ్ తదితరులు పాల్గొ పాల్గొంటారని తెలిపారు. బస్తీ దర్బార్ లో ప్రజలు పాల్గొని తమ సమస్యలు తెలియజేయాలని ఆయన కోరారు.
