420 హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
07-09-2026 | 10:16pm
450 మీటర్ల బ్యానర్‌తో కోయిలకొండలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ
కోయిలకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల్లో(Elections) ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సోమవారం కోయిలకొండలో బీఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో 450 మీటర్ల భారీ బ్యానర్‌తో 420 హామీల అమలును డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
