ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి

29-10-2026 | 04:29pm

భీమిని ఏఓ రజిత 

భీమిని, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని లక్ష్మీపూర్, అక్కలపల్లి గ్రామాల్లో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కేతి బచావో కార్యక్రమంలో భీమిని  మండల వ్యవసాయ అధికారి(Bhimini Mandal Agricultural Officer) (MAO) రజిత రైతులకు పలు సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు.

భూసారాన్ని కాపాడుకునే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సబ్సిడీపై అందించే విత్తనాలు, పురుగు మందులను సద్వినియోగం చేసుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి దిలీప్, ఏఈఓ సుప్రజ, గ్రామ కార్యదర్శి చంద్రగిరి కళ్యాణ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు