కార్యకర్త కష్టంలో కాంగ్రెస్ అండగా..
చిన్నారి వైద్యానికి రూ.2.5 లక్షల ఎల్.ఓ.సి
బచ్చన్నపేట, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ(Congress Party) కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను పార్టీ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుందని కాంగ్రెస్ పార్టీ(Congress Party) రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీనియర్ కార్యకర్త కవ్వం రాజు రెడ్డి రెండవ కుమార్తె గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం స్థానిక నాయకుల ద్వారా నాగపురి కిరణ్ దృష్టికి వచ్చింది.
వెంటనే స్పందించిన ఆయన, చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి లను కలిసి పరిస్థితిని వివరించారు.వారి చొరవతో, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయలు) విలువైన ఎల్.ఓ.సి. (లెటర్ ఆఫ్ క్రెడిట్) చెక్కును మంజూరు చేయించారు.
మంగళవారం బచ్చన్నపేట మండల కేంద్రంలో బాధిత కుటుంబానికి స్థానిక కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఆ చెక్కును నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు.
పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు నిస్వార్థంగా పనిచేసిన ప్రతి ఒక్కరి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కవ్వం రాజు రెడ్డి లాంటి కార్యకర్తలే పార్టీకి బలం. వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా మేమున్నాం అని భరోసా ఇచ్చారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.