చిన్నారిని కాపాడిన ఫైర్ సిబ్బంది
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 29(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని కొత్తిరాంపూర్ లో(Kothirampur) బెడ్‌రూమ్‌లో చిక్కుకుపోయిన 18 నెలల చిన్నారిని అగ్నిమాపక సిబ్బంది(Firefighting personnel) రక్షించారు. కొత్తిరాంపూర్ కు చెందిన జయాన్ రెడ్డి కూతురు ఉదయం ఆడుకుంటూ వెళ్లి బెడ్‌రూమ్ తలుపు గడియ పెట్టుకుంది.
గడియ తీయడం రాక చిన్నారి ఏడవడంతో గుర్తించిన తల్లిదండ్రులు ఆందోళనతో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కరీంనగర్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తలుపు తెరిచి చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, సకాలంలో స్పందించి చిన్నారిని రక్షించడంతో కుటుంబ సభ్యులు ఫైర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.