అనుమతులు లేని తరగతులు..అధిక ఫీజుల వసూళ్లపై ఫిర్యాదు..
శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి... ప్రజావాణిలో కాక్రోచ్ జనతా పార్టీ వినతి...
బాన్సువాడ, నవంబర్ 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలలో(Sri Chaitanya Private School) అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు, ప్రభుత్వ అనుమతులు లేని తరగతులను నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుడు మూడు వినోద్ సోమవారం బాన్సువాడ పట్టణంలోని ఆర్డిఓ, ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ అడ్లా రవీందర్ రెడ్డి, ఎంపీడీవో ఆనంద్లను కలిసి వినతిపత్రం అందజేశారు.
పాఠశాలలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫీజుల వసూళ్లు, అనుమతులు లేని తరగతుల నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలితే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.