అకాల వర్షానికి తడిసిన అంకుసాపూర్ రైతుల ధాన్యం..

02-11-2026 | 07:11pm

కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంపై రైతుల ఆవేదన

తంగళ్ళపల్లి, నవంబర్ 2 (విజయ క్రాంతి ):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో(Ankusapur Village) అకాల వర్షానికి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. గ్రామంలో వరి కోతలు పూర్తయి సుమారు 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మండలంలో ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అంకుసాపూర్ గ్రామంలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు