మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ

08-10-2026 | 07:59pm

బోథ్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) మండల కేంద్రంలోని పోచమ్మ గల్లీ లో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనానికి(Mahila Samakhya building) గ్రామ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ మహేందర్ భూమి పూజ చేశారు. ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తుందని వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వ్యక్తిగత రుణాలతో పాటు గ్రూపు రుణాలను ఇస్తుందన్నారు.

కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఉప సర్పంచ్ విజయ రెడ్డి టిపిసిసి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మహేందర్ బొత్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మెరుగు నరసింహ దాసు, వార్డు సభ్యులు గిరీష్ హరపే శ్రీనివాస్ కట్ట భూమేష్ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు .

మరిన్ని వార్తలు