కార్మికుల సొమ్ము అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి
విప్లవ కార్మిక సంఘాల డిమాండ్
బెల్లంపల్లి: ధన్‌బాద్‌లోని కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(Coal Mines Provident Fund Organisation) (CMPFO) వ్యవహారంలో సుమారు రూ. 3.64 కోట్ల నిధుల కుంభకోణం వెలుగులోకి వచ్చినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం(Central Government), సంబంధిత అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సింగరేణి గని కార్మిక సంఘం(Singareni Mine Workers' Union) (SGKS), శ్రామిక శక్తి గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం(Coal Mine Workers' Union) (AIFTU) డిమాండ్ చేస్తున్నాయి.
కార్మికుల భవిష్యత్ భద్రత కోసం జమ చేసిన ప్రావిడెంట్ ఫండ్ నిధులు దుర్వినియోగం కావడం తీవ్రమైన విషయంగా పరిగణించాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు(CBI registers FIR) చేసిన నేపథ్యంలో నేపథ్యంలో,నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల కోరాయి.
అదేవిధంగా, దేశవ్యాప్తంగా బొగ్గు కార్మికుల PF, పెన్షన్ నిధుల భద్రతపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని సింగరేణి గని కార్మిక సంఘం (SGKS), రాష్ట్ర నాయకులు అంబాల మహేందర్,శ్రామిక శక్తి గోదావరి లోయ బుగ్గుగని కార్మిక సంఘం (AIFTU) రాష్ట్ర కార్యదర్శి కోరారు.