తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు
మహబూబ్‌నగర్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మిషన్ భగీరథ(Mission Bhagiratha) ద్వారా జిల్లాలో ప్రజలకు తాగునీటి సరఫరాలో(Drinking water supply) ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్(Additional Collector Madhusudan Naik) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి వెబెక్స్ ద్వారా మిషన్ భగీరథ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో తాగునీటి సరఫరా పరిస్థితి, సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై డీఈలు, ఈఈలు, ఏఈలతో సమీక్షించారు. పైప్‌లైన్లు, నీటి సరఫరా వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే గుర్తించి పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు నిరంతరం అందేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.