ఓటర్ల జాబితాపై ప్రకాశ్ రాజ్ ప్రశ్నలు
03-10-2026 | 01:22pm
సీఈసీ(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నటుడు ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. SIR ప్రక్రియపై పలు ప్రశ్నలు సంధించారు.ప్రతి ఏడాది ఓటర్ల జాబితా వెరిఫికేషన్(Voter Verification) జరుగుతుందని.. అలాంటప్పుడు SIR ప్రక్రియ అవసరం ఏంటని ప్రశ్నించారు. బతికి ఉన్నవాళ్లు కూడా ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు.
అక్రమ చొరబాటుదారులు ఉన్నారని చెబుతున్నారని.. మరి ఇన్నేళ్లుగా కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు. చొరబాట్లపై కేంద్ర హోంశాఖ(Central Home Ministry) ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ఈ అంశాలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.