వెంకటస్వామి జయంతి ఏర్పాట్ల కొరకు వినతి

03-10-2026 | 06:41pm

సుల్తానాబాద్, అక్టోబర్, 03 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్(Sultanabad Municipal Commissioner) ని మరియు మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ(Birudu Krishna) ని కలిసి ఈ నెల 5 న  సోమవారం  నిర్వహించే మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి(Kaka Venkataswamy) 97వ జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్బంగా ఏర్పాట్ల గురించి టీపీసీసీ ఎస్సీ  డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యదర్శి, కాకా యువసేన సభ్యులు ఆరెపల్లి రాహుల్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ గాజుల రాజమల్లు, సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేగోళం అబ్బయ్య గౌడ్, ఐ ఎన్ టి యూ సి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నీరటి శంకర్, మాజీ సర్పంచ్ బొల్లం లక్ష్మణ్, నాయకులు జొన్నల రవీందర్, దరాడే శ్యామ్,గడ్డం సతీష్, కనుకుంట్లశ్రీనివాస్,దేవేందర్ పటేల్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు