రాష్ట్రానికి సీఎం.. జిల్లాకు నేను.. గుంపు మేస్త్రీలమే!

03-10-2026 | 01:40pm

సీఎం రేవంత్ రెడ్డి తనను తాను ‘గుంపు మేస్త్రీ’గా అభివర్ణించుకున్న నేపథ్యంలో.. వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి(Mega Reddy) కూడా ఇదే పదాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం వనపర్తిలో ఓ పల్లె దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తనను తాను వనపర్తికి ‘గుంపు మేస్త్రీ’గా అభివర్ణించుకున్నారు. “మన ముఖ్యమంత్రిని పట్టుకుని గుంపు మేస్త్రీ అంటారు. గుంపు మేస్త్రీ అంటే మంచిదే.. అందులో తప్పేముంది. వనపర్తికి నేను గుంపు మేస్త్రీ.. తెలంగాణ రాష్ట్రానికి రేవంతన్న గుంపు మేస్త్రీ” అంటూ మేఘారెడ్డి వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కొనసాగింపుగా మేఘారెడ్డి చేసిన ఈ కామెంట్స్(Caments) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral)గా మారాయి. దీంతో ‘గుంపు మేస్త్రీ’ పదంపై మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

మరిన్ని వార్తలు