మరో సత్యాగ్రహం రావాలి!
03-10-2026 | 01:30pm
హైదరాబాద్: ప్రస్తుత పాలకుల తీరుపై ప్రముఖ నటుడు, సామాజిక విశ్లేషకుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలకులు రాజ్యాంగం, ప్రజాస్వామ్య(Democracy) విలువలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
దేశంలో స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవాలంటే ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ(Gandhi) చేపట్టిన సత్యాగ్రహం తరహాలో మరోసారి పెద్ద ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.