రాయితీపై విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి
గజ్వేల్, అక్టోబర్ 3: ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాలను(Subsidized seeds) రైతులు(Farmers) సద్వినియోగం చేసుకుని పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును(Cultivation of pulses and oilseeds) ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి(District Agriculture Officer Swaruparani) సూచించారు. గజ్వేల్ రైతు వేదికలో(Gajwel Rythu Vedika) నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం అనంతరం రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేశారు. మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ పల్సెస్ (ఎంఏఎన్‌పీ) పథకం కింద శనగ విత్తనాలను 70 శాతం రాయితీపై, మినీ కిట్లను 100 శాతం రాయితీపై రైతులకు అందిస్తున్నట్లు డి ఏ ఓ స్వరూపారాణి తెలిపారు. గజ్వేల్, జగదేవ్‌పూర్, చేర్యాల మండలాలకు 50 మినీ కిట్లు, గజ్వేల్, జగదేవ్‌పూర్, బెజ్జంకి, చేర్యాల మండలాలకు 44.9 క్వింటాళ్ల శనగ విత్తనాలను రాయితీపై పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
యాసంగి సీజన్లో నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు జాతీయ నూనెగింజల మిషన్ ద్వారా జిల్లాలో 3 వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగుకు 100 శాతం రాయితీపై విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే వేరుశనగ సాగుకు 1,250 ఎకరాలకు విత్తనాలు కేటాయించినట్లు తెలిపారు. విత్తనాలు పొందే రైతుల వివరాలను కృషి మ్యాపర్, టీ-సీడ్స్ యాప్‌లలో నమోదు చేయడంతో పాటు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పంట వివిధ దశల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫొటోలను కృషి మ్యాపర్ యాప్‌లో నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ బాబు నాయక్, ఏఓ నాగరాజు, సర్దార్‌ఖాన్, సుకేందర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.