బ్రహ్మోస్ బీజీ-2 పత్తి రకంపై రైతుల సంతృప్తి
వాంకిడి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ఎల్ఎస్ఆర్ సీడ్స్(LSR Seeds) ఆధ్వర్యంలో బ్రహ్మోస్ బీజీ-2 హైబ్రిడ్ పత్తి రకం క్షేత్ర ప్రదర్శనను వాంకిడి మండలం కమాన్ గ్రామంలో నిర్వహించారు. స్థానిక రైతు లోబాడీ పత్రు వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఈ ప్రదర్శనకు పరిసర 13 గ్రామాల నుంచి సుమారు 356 మంది రైతులు హాజరై పంట తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఎల్ఎస్ఆర్ సీడ్స్ రీజినల్ మేనేజర్ నాంపల్లి తిరుపతి మాట్లాడుతూ బ్రహ్మోస్ బీజీ-2 రకం అధిక దిగుబడితో పాటు రైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.
మొక్కలకు ఎక్కువ కొమ్మలు వచ్చి, పెద్ద పరిమాణంలో బరువైన కాయలు కాస్తాయని చెప్పారు. రసం పీల్చే పురుగులు, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం ఉండటంతో పంట ఖర్చులు తగ్గే అవకాశం ఉందన్నారు.క్షేత్రాన్ని పరిశీలించిన రైతులు పంట ఎదుగుదల, కాయల పరిమాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీరామ ఆగ్రో ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూటర్లు, వైష్ణవి ట్రేడర్స్ డీలర్లు, సేల్స్ ఆఫీసర్లు నరేష్, మహేందర్, జీవన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.