ఈనెల 30న మెగా రక్తదాన శిబిరం

28-10-2026 | 09:17pm

కోటపల్లి,(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా  ఈనెల 30న చెన్నూరు రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు  నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను బుధవారం చెన్నూరు రూరల్ సీఐ ఆర్.కృష్ణ, కోటపల్లి ఎస్సై రాజశేఖర్ స్థానిక సర్పంచులు, నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

ఉదయం 9 గంటల నుంచి చెన్నూరు రూరల్ సర్కిల్ కార్యాలయం, మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. యువత, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు చెన్నూరు రూరల్ సీఐ (8712656555), కోటపల్లి ఎస్సై (8712656556), నిల్వాయి ఎస్సై (8712656557)లను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు