ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

19-10-2026 | 06:51pm

మంచిర్యాల క్రైమ్: ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా, పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు సూచించారు. సోమ వారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమిక్షలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానాలను ఆశ్రయించలేని, ఆర్థికంగా వెనుకబడిన పేదలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేయూత పథకానికి సంబంధించిన దరఖాస్తులు మున్సిపల్ కమిషనర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు