మొర్రాయిపల్లెలో బతుకమ్మ సంబరాలు

19-10-2026 | 08:02pm

ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) సంబరాలు జరుపుకున్నారు. సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి సొంత గ్రామంలో వారి కుటుంబం సభ్యులు బతుకమ్మ వేడుకల సందర్బంగా ఆటపాటలతో ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే అతిపెద్ద పండగ బతుకమ్మ అని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి పేర్కొన్నారు. తీరొక్క పూలతో అలంకారంగా బతుకమ్మలను పేర్చి మహిళలంతా ఒకచోట మైదానంలో బతుకమ్మలను పెట్టి ఆటపాటలతో అలరించారు. రాష్ట్రమంతా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తే మా గ్రామంలో ఈ రోజు అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. అనంతరం చెరువులో నిమజ్జనం చేశామని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి అలాగే మండల ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు