కోడిపందాలు ఆడుతూ పట్టుబడిన ముగ్గురు బైండోవర్
బెజ్జూర్ అక్టోబర్ 19 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలో కోడిపందాలు ఆడుతూ పట్టుబడిన ముగ్గురిని బైండోవర్ చేసినట్లు ఎస్సై రమేష్(SI Ramesh) తెలిపారు. సులుగుపల్లి గ్రామ శివారులోని గంగారంగూడ ప్రాంతంలో కోడిపందాలు ఆడుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ రామ్మోహన్ రావు ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. సదురు వ్యక్తులు మరోసారి కోడిపందాలు ఆడితే ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున, బైండోవర్ మొత్తం చెల్లించాల్సి వచ్చేలా బైండోవర్ చర్యలు చేపట్టడం జరిగింది.
మండల పరిధిలో ఎవరైనా కోడిపందాలు, జూదాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమేష్ హెచ్చరించారు. ఇప్పటికే బైండోవర్ చేసినప్పటికీ మళ్లీ కోడిపందాలు ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. మండల ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా కోడిపందాలు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ రమేష్ గారు తెలిపారు. వారి వెంట కానిస్టేబుల్ మహేందర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.