క్రీడలకు పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్

19-10-2026 | 08:18pm

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ క్రీడలకు పెద్దపీట వేస్తుందని, క్రీడాకారులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chintakunta Vijayaramana Rao) అన్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ యువ నేత ఆరవ వార్డు కౌన్సిలర్ సామాజిక సేవకులు భాకం సాయికిరణ్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ పోటీలను గత పది రోజుల నుండి సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అట్టహాసంగా నిర్వహించగా, సోమవారం రాత్రి ఫైనల్ మ్యాచ్ కావడంతో సుల్తానాబాద్ కు చెందిన చింతల్ సింగం విజేతగా నిలువగా ఎలిగేడు ఈగల్ రెండవ స్థానంలో నిలిచింది.

మొదటి విజేతకు లక్ష రూపాయలు ప్రోత్సాహక బహుమతితో పాటు ఫీల్డ్ ప్రభుత్వ వి ప్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అందజేశారు. ద్వితీయ బహుమతిని ఎలిగేడు ఈగల్ టీంకు 50 వేల నగదు ప్రోత్సాహకం తో పాటు మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు తల క్రిందలు అవుతాయని, అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఓటమిపాలు అవుతారని సూచించారు.

ప్రీమియర్ లీగ్ లో రాణించాలని దానికి తన సహకారం తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావుకు బాకం సాయికిరణ్ ఆధ్వర్యంలోని టీం భారీ ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బాణాసాంచ పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నేత సామాజిక సేవకులు దుగ్యాల సంతోష్ రావు, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల  రవీందర్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు