కార్మికుల హక్కుల కోసం ఐఎన్టీయూసీ పోరాటం..

29-09-2026 | 09:37pm

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): సింగరేణి కార్మికుల హక్కులు(Singareni workers' rights), సంక్షేమ కోసం నిరంతరం పోరాడుతున్నదని ఒక్క INTUC యూనియన్ మాత్రమే అని  ఆ సంఘం వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య పేర్కొన్నారు. కాసిపేట- 2 గనిలో మంగళవారం జరిగిన గేట్ మీటింగ్ లో ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు దేవీ భూమయ్య, ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్ మార్గదర్శకత్వంలో కార్మికుల హక్కులు సంక్షేమ కోసం పోరాడుతున్నామన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఐ ఐఎన్టీయూసీ ఎల్లప్పుడు ముందు ఉంటుందని స్పష్టం  చేశారు. గని అధికారుల తీరు వల్ల కార్మికులు తీవ్ర మానసిక శారీరక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గనిలోని రక్షణ విభాగాన్ని జనరల్ షిఫ్ట్ లో కలపడం వల్ల  ఉత్పత్తి విఘాతం కలుగుతుందన్నారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలు సరైనవి ఇవ్వకుండా పని  చేయిస్తున్నారని మండిపడ్డారు.

అధికారులు తమ తీరును మార్చుకోకపోతే కార్మికుల హక్కుల కోసం ఎంతటి పోరాడానికైన సిద్ధమని హెచ్చరించారు. కార్మికులు బాగుంటేనే సింగరేణి సంస్థ బాగుంటుందని, గతం లో సంస్థ BIFR లోకి వెళ్లినప్పడు ఇక్కడి కార్మికులు బాగుండాలని సింగరేణిని కాపాడాలని అప్పటి  పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు కాక వెంకటస్వామి, జనక్ ప్రసాద్ గారిని కార్మిక నాయకులను తీసుకొని వెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి  463 కోట్ల పెట్టు బడితో సింగరేణిని కాపాడడం జరిగిందనీ గుర్తు చేశారు.

చరిత్రలో సంస్థను కార్మికులు వేనుతిరగనియ్యలేదనీ, కొంత మంది అధికారులు కార్మికులకు కనీస సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఇప్పటికైనా కార్మికులకు వెంటనే  సేఫ్టీ పని ముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీ ప్రొడక్షన్ లో కార్మికులను సేఫ్టీ తో భాగస్వామ్యులు చెయ్యాలని INTUC కో రుతున్నాదన్నారు.

అలాగే నాణ్యత లేనీ పనిముట్లు సేఫ్టీ పరికరాలు త్వరగా  పాడైపోయి కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. కార్మికులకు  నాణ్యతగల పరికరాలు ఇవ్వాలన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఏరియా సెక్రెటరీ చంద్రశేఖర్, ఫిట్ కార్యదర్శి కారుకూరి రామచందర్,అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ రవి కిరణ్, బండారి శంకర్, కొప్పుల ఓదెలు, సత్తయ్య, భాస్కర్, దోసల శ్రవణ్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు