హనుమకొండ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..

29-09-2026 | 10:04pm

హనుమకొండ, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి విద్వేష వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం బిజెపి హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం బిజెపి రాష్ట్ర నాయకురాలు రావు పద్మ(State leader Rao Padma) మాట్లాడుతూ... రాముడు, శివుడిని వేరు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని చీల్చాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

శ్రీరాముడే శివుడిని కొలిచాడనీ, కాంగ్రెస్ విభజన రాజకీయాలను హిందూ సమాజం తిప్పికొడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రావు పద్మ రెడ్డి, పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ డా కాళీ ప్రసాద రావు, హనుమకొండ జిల్లా కార్యదర్శి ఆర్ పి జయంత్ లాల్, మార్క సునీల్ గౌడ్,బైరి శ్రవణ్, గుజ్జుల వసంత, శ్రీకాంత్ పటేల్, కొండెం రవీందర్ రెడ్డి, రాదారపు శివ కుమార్, కవిత, జరీనా, ధనలక్ష్మి, అనిల్, వాసుదేవ రెడ్డి, భరత్ గౌడ్, శ్రీరామ్ రెడ్డి, పున్నం వేణు, నిఖిల్ రావు బాణాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు