ఆటపాటలతో అలరించిన ఫ్రెషర్స్ పార్టీ

29-09-2026 | 10:06pm

తలమడుగు సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తలమడుగు(Talmadugu) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సర్పంచ్ రాజన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాంలు, బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సూరజ్‌సింగ్, అధ్యాపకులు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు