భూపాలపల్లి ఏరియాలో స్పెషల్ క్యాంపెయిన్ 6.0

29-09-2026 | 10:08pm

3 దశల్లో నిర్వహణ సమీక్ష సమావేశంలో ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 29 ( విజయ క్రాంతి ) : సింగరేణి భూపాలపల్లి ఏరియాలో (Singareni Bhupalapally Area)స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జీఎం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పెషల్ క్యాంపెయిన్ 6.0 లో భాగముగా కార్యాలయాలు, పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు, ఈ వేస్టును సమర్థవంతంగా వేరు చేసి, సక్రమంగా పారవేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ క్యాంపెయిన్ మూడు దశల్లో నిర్వహించబడుతుందని సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు ప్రిపరేటరీ ఫేజ్, అక్టోబర్ 2 నుంచి 31 వరకు ఇంప్లిమెంటేషన్ ఫేజ్, నవంబర్ 17 నుంచి 30 వరకు ఎవాల్యుయేషన్ ఫేజ్ కొనసాగుతాయని తెలిపారు. గత సంవత్సరం 5.0 లో భాగముగా 52 ప్రదేశాలలో  114250 చదరపు అడుగులు ఇంప్లిమెంటేషన్ చేయగా కంపనీ వ్యాప్తంగా తృతీయ బహుమతి వచ్చిందని, ఈ సంవత్సరం 336438 చదరపు అడుగులు ఇంప్లిమెంటేషన్ చేసి మొదటి బహుమతి గెలుచుకోవాలని  ఈ సందర్భంగా జీఎం అధికారులను సూచించారు.

అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి స్పెషల్ క్యాంపెయిన్ 6.0 ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవ ఎస్ఓ టు జీఎం రామన్ వి పాఠక్, సివిల్ ఏజీఎం, రవికుమార్, ఐఈడీ ఏజీఎం జోతి, కేటీకే ఓసీపీ 2 పీఒ శ్యామ్ సుందర్, ఓసీపీ 3 పీఒ రామస్వామి, ఏరియా కేటీకే 1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి,  పర్సనల్ మేనేజర్  ఎస్ శ్యామ్ సుందర్ , ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ టి పోషమల్లు, అన్ని గనుల, డిపార్ట్మెంట్ల  అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు