జాతీయ స్థాయి సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు సీవోఈ విద్యార్థి సుశాంత్ ఎంపిక

24-09-2026 | 12:41pm

బెల్లంపల్లి,(విజయక్రాంతి): జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల(softball competitions)కు బెల్లంపల్లి సీవోఈ విద్యార్థులు ఎంపిక అయ్యారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల(Telangana Social Welfare Gurukul) బెల్లంపల్లిలో 9వ తరగతి చదువుతున్న గజ్జల సుశాంత్ జాతీయ స్థాయి సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపీకయ్యారని జిల్లా సాఫ్టు బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తోట పోచన్న, భాసబోయిన కిరణ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో సెప్టెంబర్ 11 నుంచి 13, 2026 వరకు నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలలో మంచిర్యాల జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించడంలో సుశాంత్  కీలక పాత్ర, పోషిస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయి సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు సెప్టెంబర్ 25 నుంచి 27, 2026 వరకు మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో జరిగే పోటీలో పాల్గొంటారని తెలిపారు.జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థ జి. సుశాంత్ ను పాఠశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయ సాగర్ అభినందించారు.

మరిన్ని వార్తలు