ఆరోగ్యవంతమైన కుటుంబానికి పౌష్టికాహారం అవసరం
బోథ్. సెప్టెంబర్ 24 ( విజయకాంత్) ఆరోగ్యవంతమైన కుటుంబానికి పోషకాహారం(Nutritious food) ఎంతగానో ఉపయోగపడుతుంద ని ఐసిడిఎస్ సిడిపిఓ నరసమ్మ(ICDS CDPO Narasamma) పేర్కొన్నారు. గురువారం మండలంలోని కుచలాపూర్ గ్రామంలో ని అంగన్వాడి కేంద్రంలో పోషక మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీలు తల్లులు పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.
ఆకుకూరలు పప్పులు గుడ్లు పండ్లు కూరగాయల్లో పౌష్టికాహారం ఎంతగానో ఉంటుందన్నారు. సరైన ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం అంతగా ఉంటారన్నారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ మైలి నారాయణ ఉపసర్పంచ్ అరుణ్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ కళావతి సూపర్వైజర్ మౌనిక ,ఎంపీపీ ఎస్ స్కూల్ చైర్మన్ ప్రమీల, ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి రణధీర్ దీపిక అయ్యమ్మ లక్ష్మి రమ్యల తో పాటు గర్భిణీ స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.