సింగరేణి బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలి
- సిఐటియు నాయకులు
- ఇందిరా పార్క్ ధర్నాను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్ విడుదల
నస్పూర్, (విజయక్రాంతి) : సింగరేణికి(Singareni) రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(Singareni Collieries Employees' Union) (సిఐటియు) ఆర్కె 5 పిట్ కమిటీ, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ చిగురు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పరిశ్రమలను కాపాడాలని ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాదులోనీ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ శని వారం వాల్ పోస్టర్ విడుదల(Wall poster release) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్(Labour Code) లపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలన్నారు.
సింగరేణికి రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, లాభాల వాటా ప్రకటన రోజున చెప్పిన వాగ్దానాలను వెంటనే సింగరేణిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి సింగరేణితో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పలు డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో citu నాయకులు నెలబోయిన కుమార్, పుప్పాల మహేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.