ఐరాస సదస్సులో రోటర్‌డామ్ విద్యార్థులు
ఘట్ కేసర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని(United Nations Day) పురస్కరించుకుని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్, ఫిల్వెక్స్ హాబీ సొసైటీ, ఇండియన్ వెక్సిలాలజికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నగరంలోని సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈకార్యక్రమానికి పోచారం డివిజన్ పరిధిలోని రోటర్‌డామ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు(Rotterdam International School) ప్రత్యేక ఆహ్వానం అందగా, పాఠశాల ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి విద్యార్ధులతో(Students') సహ పాఠశాల తరపున పాల్గొన్నారు. పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, ప్రపంచ పౌరసత్వం పట్ల పాఠశాల నిబద్ధతను చాటిచెప్పారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వం మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఐఏఎస్, పాల్గొన్నారు. వేడుకలో భాగంగా భారత జాతీయ పతాకంతో పాటు ఐక్యరాజ్యసమితి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ప్రసంగాలు నిర్వహించారు.
సంజీవయ్య పార్క్‌లోని భారీ భారత జాతీయ పతాకం వద్ద నుంచి నెక్లెస్ రోడ్ వరకు, తిరిగి కార్యక్రమ వేదిక వరకు ఆరు కిలోమీటర్లు వివిధ దేశాల జాతీయ పతాకాలతో స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్య ద్వారా ప్రపంచ శాంతి, సుస్థిర అభివృద్ధి, బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరసత్వాన్ని ప్రోత్సహించాలనే పాఠశాల లక్ష్యానికి ఈ కార్యక్రమం మరింత ప్రేరణనిచ్చింది.