పోలీస్ స్టేషన్‌లో ‘ఓపెన్ హౌస్’

27-10-2026 | 06:28pm

బెల్లంపల్లి: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని బెల్లంపల్లి 1వ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ‘ఓపెన్ హౌస్(Open House)’ కార్యక్రమం నిర్వహించారు. సీఐ కె శ్రీనివాస రావు ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, రిసెప్షన్ డెస్క్, మహిళా హెల్ప్ డెస్క్ (Women's Help Desk), కేసుల నమోదు విధానం లాకప్ రూమ్స్ గురించి సమగ్రంగా వివరించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఎలా పనిచేస్తారు, శాంతిభద్రతలను కాపాడటంలో వారి పాత్ర ను విద్యార్థులకు ఆవాహన కల్పించారు. 

మహిళలు, బాలబాలికల భద్రత కోసం ఏర్పాటు చేసిన 'మహిళా సహాయ కేంద్రం'(Women's Help Desk) విశిష్టతను వివిధ అత్యవసర సహాయక హెల్ప్‌లైన్ నంబర్లను తెలియజేశారు. దేశం కోసం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని, విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టం పట్ల గౌరవం, బాధ్యతాయుత పౌరులుగా ఎదిగే క్రమశిక్షణను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఉపయోగించే వివిధ పరికరాలు, కమ్యూనికేషన్ సాధనాలు, ఆయుధాల గురించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ డి. రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు