పారిశుద్ధ కార్మికులకు సానిటేషన్ కిట్లు పంపిణీ
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
భూత్పూర్, అక్టోబర్ 9 : భూత్పూర్ మున్సిపాలిటీ(Bhoothpur Municipality) కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు(Sanitation workers) సానిటేషన్ కిట్లను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి(Madhusudan Reddy) పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ(Health Preservation) కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెల కట్టలేనివని అన్నారు. విధి నిర్వహణలో వారు చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులు చేపట్టే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కార్మికులు ఈ సానిటేషన్ కిట్లను సద్వినియోగం చేసుకుంటూ తగిన రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. పట్టణ పరిశుభ్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్మికుల ఆరోగ్యం, భద్రతకు సంక్షేమానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పరిశుద్ధ కార్మికుల సేవలను ప్రతి ఒక్కరు గుర్తించి గౌరవించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడావత్ బాలకోటి, కమిషనర్ పవన్ కుమార్, కౌన్సిలర్లు పద్మ, లాలూ నాయక్, శ్రీనివాసులు, ప్రేమ్ కుమార్, లతా, చంద్రకళ, కో ఆప్షన్ సభ్యులు పవన్, అప్రోజ్ తోపాటు నరేందర్, మట్టి ఆనంద్, మనన్, రాజేష్ తోపాటు తదితరులు