ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు
గండీడ్, నవంబర్ 1 (విజయక్రాంతి): మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో ప్రతి ఇంటికీ సక్రమంగా తాగునీరు(Drinking Water) అందించేందుకు గ్రామ సర్పంచ్ గొల్ల సత్యమ్మ సాయిలు చర్యలు చేపట్టారు. గ్రామంలో పంపు మోటార్ మరమ్మతుకు గురికావడంతో నూతన మోటార్‌ను కొనుగోలు చేసి తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గొల్ల సత్యమ్మ సాయిలు, ఉపసర్పంచ్ పారిజాత శ్రీనివాస్ రెడ్డితో పాటు మొదటి వార్డు సభ్యుడు మున్నూరు రఘు, రెండో వార్డు సభ్యుడు పిట్ల నారాయణ వార్డుల్లో తాగునీటి సరఫరా పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి వార్డులో ప్రతి ఇంటికీ తాగునీరు సక్రమంగా అందేలా కృషి చేస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.