ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమం

28-10-2026 | 09:52pm

విజయ క్రాంతి/ మూసాపేట్;ముసాపేట మండలం పరిధిలోని వేముల గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections) సన్నాహక సమావేశంలో బుధవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Ala Venkateswar Reddy)  పాల్గొన్నారు.ఈ సందర్భంగా  గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు,పట్టభద్రులతో సమావేశమై, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు.

పార్టీ కార్యాచరణపై చర్చించారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ, పట్టభద్రుల ఓటరు నమోదు మరియు ఎన్నికల సన్నాహక కార్యక్రమాలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ ,మాజీ జడ్పిటిసి ఇంద్రయ్య సాగర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు