న్యాయ వ్యవస్థపై విద్యార్థులకుఅవగాహన

28-10-2026 | 09:07pm

రాజాపూర్: న్యాయ వ్యవస్థ పై విద్యార్థులకు తగిన అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జ్ ఇందిరా దేవి(District Judge Indira Devi) అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(PM Shri Government High School)లో విద్యార్థుల(Students )కు పొక్సో చట్టం, న్యాయ వ్యవస్థ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయస్థానం అందించి సేవల, ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. న్యాయ చట్టాలు,లా అండ్ ఆర్డర్, నేరాలు,కోర్టు విధులు,కోర్టు,చట్టాల ద్వారా పొందే ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు