బేలలో ఘనంగా పొలాల పండుగ

10-09-2026 | 10:42pm

బేల,(విజయక్రాంతి): బేల మండలం(bela mandal)లో రైతులు సంప్రదాయబద్ధంగా పొలాల పండుగ(Pola festival)ను ఘనంగా నిర్వహించారు. పంట పొలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, పాడి పశువులను అలంకరించి రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గ్రామీణ సంప్రదాయాలు, వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబించేలా పొలాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు