చిన్నకొరుకొండి బీసీ హాస్టల్‌లో ఎంపీడీవో తనిఖీ

10-09-2026 | 10:38pm

కల్లూరు,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో చంద్రశేఖర్ చిన్నకొరుకొండి బీసీ హాస్టల్‌ను సందర్శించి తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్‌లోని ఆహార పదార్థాల నిల్వలను పరిశీలించారు.విద్యార్థులకు పరిశుభ్రమైన,రుచికరమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. వంటగది,హాస్టల్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని వార్డెన్‌కు సూచించారు.

మరిన్ని వార్తలు