500 కోట్లు కొల్లగొట్టిన ‘త్రిపుర’!

08-10-2026 | 05:30am

రియల్ ఎస్టేట్ పేరిట మహా మోసం

  1. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో వందలాది మందికి బురిడీ
  2. సాఫ్ట్‌వేర్, బీడీఎల్ ఉద్యోగుల సొమ్ము స్వాహా
  3. సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
  4. పసుపులేటి సుధాకర్‌పై కఠిన చర్యలకు డిమాండ్  

హైదరాబాద్ సిటీబ్యూరో/సంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకున్న సామాన్య, మధ్యతరగతి ఉద్యోగుల(Ordinary and middle-class employees) ఆశలను ఆ సరాగా చేసుకుని, ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో కో ట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడి న ఘరానా మోసం వెలుగులోకి వ చ్చింది. మార్కెట్ ధర కంటే తక్కువకే ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామని నమ్మబలికి కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.500 కోట్లు దండుకు న్న త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ సంస్థ(Tripura Constructions Company) ప్రతినిధులపై బాధితులు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(Hyderabad Central Crime Station) (సీసీస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తక్కువ ధరకే ఫ్లాట్లంటూ ఎర

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ ప్రాంతంలో ఆకర్షణీయమైన ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ప్రీలాంచ్ ఆఫర్ కింద అత్యంత తక్కు వ ధరకు ఫ్లాట్లు అందిస్తామని త్రిపుర కన్‌స్ట్రక్షన్ సంస్థ 2021లో విస్తృత ప్రచారం చే సింది. ఈ ప్రకటనలకు ఆకర్షితులైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీల్ ) ఉద్యోగులు, ఐటీ కంపెనీల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విశ్రాంత ఉద్యోగులు దాదాపు 350 మందికి పైగా బా ధితులు తమ వద్ద ఉన్న జీవితకాల కష్టార్జితా న్ని రూ.లక్షల్లో త్రిపుర కన్‌స్ట్రక్షన్ సంస్థకు    చెల్లించారు.

భూమి విక్రయానికి కుట్ర

డబ్బులు వసూలు చేసి ఏళ్లు గడుస్తున్నా సదరు కన్స్ట్రక్షన్ సంస్థ కనీసం అనుమతులు తీసుకోలేదని, పునాది పనులు కూడా ప్రారంభించలేదని బాధితులు ఆరోపించా రు. బాధితులు ప్రశ్నించినప్పుడల్లా సంస్థ ప్రతినిధులు కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని చెప్పి తమ వద్ద నుంచి వసూలు చేసిన సొ మ్ముతో కొనుగోలు చేసిన భూమిని, ప్రస్తుతం వేరొక రియల్ ఎస్టేట్ వ్యాపారికి విక్రయించేందుకు త్రిపుర సంస్థ యత్నిస్తున్నట్లు తెలుసుకున్న బాధితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

‘సొంతింటి కోసం దాచుకున్న డబ్బులన్నీ చెల్లించాం. ఇప్పుడు ఫ్లాటూ ఇవ్వడం లేదు, కట్టిన డబ్బులూ తిరిగి ఇవ్వడం లేదు. ల్యాండ్ కూడా వేరేవాళ్లకు అమ్ముకోవడానికి చూస్తున్నారు. మ మ్మల్ని రోడ్డున పడేసిన వారిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఫ్లాట్లు రాక, అటు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వకపోగా బాధ్యులైన వారు రాజకీయ పలుకుబడితో బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఆగ్రహానికి గు రైన బాధితులు బుధవారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి అనంతరం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిపుర కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఛైర్మన్ పసుపులేటి సుధాకర్‌పై, ఇతర డైరెక్టర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు చెల్లించాల్సిన సొ మ్మును పూర్తిగా రికవరీ చేసి ఇవ్వాలని కోరారు. పోలీసులు ఈ  రియల్ ఎస్టేట్ మో సంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. గ తంలో కూడా ఈ సంస్థపై ’త్రిపుర నిర్వాణ’, ’త్రిపుర సుకృతి’ ప్రాజెక్టుల పేరిట  కేసులు, జరిమానాలు నమోదైనట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు