AIతో కాసుల వర్షం!.. అసలు ట్విస్ట్ ఇక్కడే?

08-10-2026 | 06:43am

Meta Platforms‌కి చెందిన Muse AI Agent ఇప్పుడు కేవలం ఒక Artificial Intelligence Tool‌గానే కాకుండా.. భవిష్యత్‌లో కంపెనీకి భారీగా Revenue తెచ్చిపెట్టే Business Engine‌గా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ ఆర్థిక సంస్థ Deutsche Bank విశ్లేషకుడు Benjamin Black చేసిన అంచనాలు ఇప్పుడు టెక్ మార్కెట్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఆయన అంచనా ప్రకారం 2030 నాటికి Meta Muse Revenueలో గరిష్ఠంగా 8 శాతం వరకు వాటా సాధించే అవకాశం ఉంది. ఇదే జరిగితే Muse ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారు $36 బిలియన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది గరిష్ఠ అంచనా మాత్రమే. కనిష్ఠంగా చూసినా 2030 నాటికి Muse సుమారు $2.4 బిలియన్ల Revenue అందించే అవకాశం ఉందని Deutsche Bank అంచనా వేసింది. ఇక్కడ అసలు విషయం కేవలం AI Agent Monetization కాదు. Muse ద్వారా జరిగే ప్రతి Transactionపై Meta ఫీజు పొందడంతో పాటు.. యూజర్లు ఏం కొనుగోలు చేస్తున్నారనే సమాచారం, Shopping Intent వంటి అంశాలు Meta ప్రధాన Advertising Businessకు కూడా మరింత విలువను జోడించే అవకాశం ఉంది.

అసలు ట్విస్ట్ ఇక్కడే..

Meta Muse ఇప్పటికే మార్కెట్లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. తాజా Sensor Tower డేటా ప్రకారం ఈ Meta AI Agent Downloads 5.1 మిలియన్లకు పైగా నమోదయ్యాయి. అంతేకాదు.. Online Shopping‌ను Museలో మరింత బలపరిచేందుకు Meta పలు పెద్ద కంపెనీలతో Commerce Partnerships‌ కూడా కుదుర్చుకుంది. Walmart, Gap, Sephora, Expedia, Wayfair, Best Buy వంటి సంస్థలతో భాగస్వామ్యాలు ప్రకటించడం ద్వారా AI Shoppingను పెద్ద స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. Museలో యూజర్ ఒక వస్తువు కావాలని అడిగితే.. Brand, Price, Availability వంటి వివరాల ఆధారంగా Retail Websitesలో ఆప్షన్లను వెతికి చూపిస్తుంది. కొనుగోలు చేసే సమయంలో Approval Card ద్వారా Order Details‌ను యూజర్‌కు చూపించి.. చివరి Confirmation వచ్చిన తర్వాతే Purchase ప్రక్రియ కొనసాగుతుంది. Payments విషయంలో Link by Stripe, Shopify Shop Pay వంటి Partners‌ను ఉపయోగిస్తోంది. PayPal‌ను కూడా భాగస్వామిగా ప్రకటించినప్పటికీ.. ఆ సదుపాయం ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు.

AI Agent నుంచి Personal Assistant వరకు..

Meta CEO Mark Zuckerberg లక్ష్యం కేవలం Shopping Assistant‌తో ఆగిపోవడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. Personal Superintelligence దిశగా Meta ముందుకు వెళ్తోందని కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో Museను భవిష్యత్‌లో రోజువారీ పనులను నిర్వహించే Always-on Personal AI Assistantగా మార్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే Meta AI కోసం ప్రత్యేకంగా రూపొందించిన Muse Charm అనే Pocket Device‌ను కూడా పరిచయం చేసింది. Voice Interaction ఆధారంగా Museతో మాట్లాడేందుకు దీన్ని ఉపయోగించవచ్చు. మరోవైపు Meta తన AI Hardware Strategyలో భాగంగా కొత్త Spatial Computing Glasses, Ray-Ban Meta Gen 3 Smart Glasses, Camera-free Audio Glasses వంటి ఉత్పత్తులను కూడా ముందుకు తీసుకొస్తోంది.

Meta Stockపై కూడా ప్రభావం?

Museపై ఈ భారీ అంచనాలు రావడం, Meta AI Business‌ను విస్తరించడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు.. ఇన్వెస్టర్ల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. అక్టోబర్ 2 నాటికి Meta Stock ధర $728 వద్ద ఉండగా, 52-Week High $780గా నమోదైంది. Analyst Target Price సుమారు $795గా ఉంది. ఇటీవల Meta షేర్‌లో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది. అయితే Museకు అన్నీ సాఫీగా సాగుతున్నాయని చెప్పలేం. Amazon మాత్రం Muse ద్వారా తన ప్లాట్‌ఫామ్‌లో కొనుగోళ్లను అనుమతించడం లేదు. Muse తమ Terms of Service‌ను ఉల్లంఘిస్తోందన్న కారణంతో Amazon ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. Meta Muse నిజంగానే 2030 నాటికి $36 Billion Business‌గా మారుతుందా? లేక AI Agent మార్కెట్‌లో మరో ప్రయోగంగానే మిగిలిపోతుందా? వచ్చే కొన్ని సంవత్సరాల్లో Muse సాధించే User Growth, Shopping Transactions, Advertising Impact ఆధారంగానే దీనికి సమాధానం దొరకనుంది.

మరిన్ని వార్తలు