మందకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్

07-10-2026 | 10:54am

హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల రోస్టర్ పాయింట్లలో(SC Categorization Telangana) మార్పులు చేసే ప్రయత్నం జరిగితే తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణలో జనాభా ప్రాతిపదికన మాదిగలకు తగిన స్థాయిలో వాటా దక్కలేదని ఆయన పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట జరిగిన ఎంఎస్‌ఎఫ్ జాతీయ ప్రతినిధుల సదస్సులో మందకృష్ణ మాదిగ ఈ అంశాలను ప్రస్తావించారు. SC Categorization, SC Reservation, SC Roster Points, Madiga Reservation వంటి అంశాలపై ఆయన ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్లను పెంచడంతో పాటు వర్గీకరణకు అనుగుణంగా మాదిగలకు 14 శాతం వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.

సీఎం హామీ అమలు చేయాలి

జనాభా లెక్కల ప్రక్రియ పూర్తైన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను(SC reservations) పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy SC Reservation) ఇచ్చిన హామీని అమలు చేయాలని మందకృష్ణ కోరారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత రోస్టర్ సవరణ పేరుతో మరో వివాదానికి దారితీసే చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు.

మార్చిలో ‘ఛలో హైదరాబాద్’

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వచ్చే మార్చిలో ‘ఛలో హైదరాబాద్’(Chalo Hyderabad) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మందకృష్ణ ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని, సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కుల వివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం కోసం మాలలు సహా అన్ని సామాజిక వర్గాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలను కలుపుకుని సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతల నిర్మూలన కోసం ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు