నా బ్లౌజ్ గురించి చర్చ పెట్టడమేంటో..!

08-10-2026 | 05:35am

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్(Bollywood star actress Kriti Sanon) తన దుస్తులపై జరిగిన చర్చపై ఎట్టకేలకు నోరు విప్పింది. ఒక జ్యువెలరీ బ్రాండ్(Jewelry brand) కోసం ఆమె నటించిన రక్షాబంధన్ ప్రకటనలో సాంప్రదాయ పండుగ వాతావరణానికి(Traditional festive atmosphere) తగని విధంగా మోడ్రన్ దుస్తులు(Modern outfits) ధరించారంటూ గతంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రక్షాబంధన్ ప్రకటనలోని కృతి ఇండో-వెస్ట్రన్ దుస్తులు(Kriti in Indo-Western outfits) ధరించడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సదరు బ్రాండ్ ఆ యాడ్‌ను ఉపసంహరించుకుంది. తాజాగా ‘వాట్ విమెన్ వాంట్(What Women Want)’ టాక్ షోలో అతిథిగా పాల్గొన్న కృతి సనన్.. ఆ దుస్తుల వివాదంపై స్పందించింది.

“ఒక పండగ ప్రకటనలో నా చోళీ (బ్లౌజ్) అంత పెద్ద వివాదం సృష్టిస్తుందని నేను ఊహించలేదు. ప్రైమ్-టైమ్ వార్తల్లో నా బ్లౌజ్ గురించి ఆరుగురు సభ్యుల ప్యానెల్ కూర్చొని చర్చించడం చూసి షాక్ అయ్యా. నా కళ్లను నేనే నమ్మలేకపోయా” అని తెలిపింది. ఇక మహిళల స్వేచ్ఛపై కృతి మాట్లాడుతూ.. ‘మహిళలను పదే పదే జడ్జ్ చేయడం ఆపాలి. సమాజం ఇతరుల విషయాల్లో అనవసరంగా తలదూర్చకుండా ఎవరి పని వారు చూసుకుంటే చాలు.

మహిళలు కోరుకునేది అదే. మహిళలు గౌరవాన్ని, సంస్కృతిని గుండెల్లో మోస్తారు. వారు వేసుకునే బట్టల ఆధారంగా వారి సంస్కారాన్ని అంచనా వేయలేరు. ప్రస్తుతం కృతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంస్కృతి, సంప్రదాయాలు అనేవి గుండెల్లో ఉంటాయి, వేసుకునే దుస్తుల నెక్ లైన్ (మెడ భాగం)లో కాదు’ అంటూ కృతి గతంలోనూ గట్టి కౌంటర్ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు