ప్రతి ఒక్కరి మనసులో చేరాల్సిన సినిమా ఇది
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా(Renowned spiritual guru Neem Karoli Baba) జీవితం, బోధనల స్ఫూర్తితో రూపొందిన సినిమా ‘హనుమాన్ అంశ్(Hanuman Ansh)’. డాక్టర్ విశాల్ చతుర్వేది రచనాదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నీమ్ కరోలి బాబా(Neem Karoli Bab) పాత్రలో శోభినవ్ సత్య(Sobhinav Satya) నటించారు. చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ కీలక పాత్రల్లో కనిపించారు. హిందీలో విజయవంతమైన థియేట్రికల్ జర్నీ అనంతరం ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హొంబాలే ఫిలమ్స్ ఈ చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
అక్టోబర్ 9న ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో శోభినవ్ సత్య మాట్లాడుతూ.. ‘విశాల్ మన భారతీయ సంస్కృతికి చాలా కీలకమైన, ముఖ్యమైన సినిమాని తీశారు. ఆయన వల్లే ఈ సినిమా ఎక్కడ వరకు చేరింది. రాగిణి నిజాయితీగా ఈ సినిమాని నిర్మించారు. హనుమంతుల వారి ఆశీర్వాదంతోనే ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని అందుకుందని నమ్ముతున్నాం. ఇది భారతీయల సినిమా.
ప్రజలందరూ తమ సినిమాలాగా ప్రచారం చేశారు. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ అందుతుందని నమ్మకం ఉంది. ఇది ప్రతి ఒక్కరి మనసులో చేరాల్సిన సినిమా. అందరూ చూసి సినిమా గురించి అందరితో పంచుకుంటారని కోరుకుంటున్నాను” అన్నారు. డైరెక్టర్ విశాల్ మాట్లాడుతూ.. “తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా భారీ భారీ హనుమాన్ విగ్రహాలు కనిపిస్తాయి. మనందరం కూడా బజరంగ్‌భలి భక్తులమే. హనుమంతుల వారు అన్నిచోట్ల ఉంటారు. అందరూ థియేటర్లలో ఆస్వాదించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.