కార్మిక చట్టాలు ఎవరి వైపు ఉన్నాయ్

08-10-2026 | 05:20am
  1. కంపెనీలో పనిచేస్తున్న వారికి కూలీల డబ్బులు
  2. ఖాతాలో వేయకుండా నేరుగా చెల్లిస్తున్న వైనం 
  3. అధికారుల పర్యవేక్షణ నిల్..ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
  4. ఇష్టానుసారం వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేట్ కంపెనీలు 
  5. అధికారులకు వరుసగా ఫిర్యాదులు 

బాలానగర్, అక్టోబర్ 7 : కార్మికుల(Workers') కోసం తయారుచేసిన చట్టాలు ఎవరికోసం ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. కంపెనీలు ఏర్పాటు చేసుకొని వాటిలో పనిచేస్తున్న వారికి వేతనం బ్యాంక్ ఖాతా(Salary bank account) ద్వారా ఇవ్వాల్సి ఉండగా ఆ నిబంధనలు తుంగలో తొక్కి కూలీ డబ్బులు మాదిరిగా నేరుగా చేతికి ఇవ్వడంలో ఉన్న అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తుండ్రు.

మేము ఇలానే ఇస్తాం వస్తే కూలీ కి రండి లేకుంటే లేదు అన్నట్లు వ్యవహరించడం అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని వారు ఆరోపిస్తుండ్రు. కంపెనీలు ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు(Employment and job opportunities) కలుగుతాయని భావించి ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నప్పటికీ కేవలం పనిచేస్తున్న వారిని కూలీలుగా చూడడం విడ్డూరంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తుండ్రు. 

 ఈ కంపెనీలో ఉద్యోగులు కాదు.. కూలీలే..

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలోని ఎంఎస్ యాంస్ప్రో ల్ఫైు్సన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(M/s Amspro Lifesciences Private Limited) (సర్వే నంబర్ 631/ఏ1) పరిశ్రమలో కార్మిక చట్టాలు(Labour Laws) ఉల్లంఘిస్తున్నారం టూ సామాజిక కార్యకర్త కోటి వెంకటయ్య కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంస్థలో గత కొన్నేళ్లుగా సుమారు 150 మంది, ఇటీవల సుమారు 40 మంది కార్మికులతో పనులు చేయించుకుంటున్నప్పటికీ వారికి ఈఎస్‌ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు సక్రమంగా కల్పించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్మికుల వేతనాల చెల్లింపులోనూ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై సెప్టెంబర్ 15న జిల్లా కలెక్టర్, ఉప కార్మిక కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.సంస్థలో కార్మిక చట్టాల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను కోరారు.

 తనిఖీలు చేపడితేనే ఉపయోగకరం...

 ఉన్నతాధికారులు ప్రైవేట్ కంపెనీల నిర్వహణ ఎలా జరుగుతుందో నిత్యం తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. జరుగుతున్న తప్పులను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన స్పందించకపోవడం సరికాదని వారు అసహనం వ్యక్తం చేస్తుండ్రు. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో న్యాయ కంపెనీల నిర్వహణపై తనిఖీలు వచ్చే పట్టాలని ప్రజలు కోరుతుండ్రు.

మరిన్ని వార్తలు