కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి సమాజానికి ఆదర్శప్రాయుడు

27-09-2026 | 04:19pm

బోథ్.సెప్టెంబర్ 27(విజయ క్రాంతి): కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి సమాజానికి ఆదర్శప్రాయుడని మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్,పద్మశాలి సంఘం అధ్యక్షులు మెరుగు భోజన్న పేర్కొన్నారు. ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 112జయంతి వేడుకలు పట్టణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు.ఆయన గొప్ప సంఘసంస్కర్త అని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్ ఉపసర్పంచ్  విజయరెడ్డి ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి సచ్చిదానంద రెడ్డి వార్డు సభ్యులు మేడ్చల్మ ప్రవీణ్‎తో పాటు పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు